గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయాయి. లిమిటెడ్ ఓవర్లకు సంబంధించి 2013లో చివరి సిరీస్ జరిగింది. అప్పుడు భారత్ పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ సందర్భంగా 3 వన్డేలు, రెండు టీ20లు ఆడారు. ఇక టెస్టుల విషయానికి వస్తే 2007-08 సీజన్ లో చివరి మ్యచ్ జరిగింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లను భారత్ నిలిపివేసింది. కేవలం ప్రపంచ కప్, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి మాట్లాడుతూ భారత్ తో ఆడటానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో తాము భారత్ వెంట పరుగెత్తమని స్పష్టం చేశారు.
భూదందా కోసమే రాజధాని మార్పు: కన్నా