సాధారణంగా వివాహపొంతనలు చేసేప్పుడు నక్షత్రం, రాశి తదితర అంశాలు పరిగణలోకి తీసుకుంటరు. అవన్నీ సరిగా సరిపోతేనే ఆ వివాహం జోలికి వెళతారు.. ఏదైనా పొంతనలో తేడా ఉందని తేలితే, ఆ వివాహ ఆలోచన మానేసి, మరో సంబంధం వెతుకుతారు పెద్దలు. అయితే ఏ రాశి వారు ఎలా ఉంటారు, అలాగే వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుంటే ఇవన్నీ మనకి కూడా కాస్త అర్ధం అవుతాయి. వారివారి మనస్తత్వం, వారి లక్షణాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ధనస్సు రాశివారి గురించి తెలుసుకుందాం.. వీరు ఎటువంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. వీరి మీద ఏమైనా ఆంక్షలు పెడితే మాత్రం అసలు సహించరు.
వీళ్లు ఎంతసేపటికి వారి ఇష్టం వచ్చినట్టుగా మాత్రమే ఉంటారు. ఈ రాశి వారు ఎవరితోనూ ఇబ్బందికరంగా ప్రవర్తించరు. అందరితోనూ హుందాగా ఉంటారు. ఈ రాశి వారికి గురువు ఆధిపత్యం వహిస్తాడు, కాబట్టి పది మందికి సలహాలు ఇచ్చే విధంగా ఉంటారు.
ఏ రంగంలో ఉన్నా కూడా వీరు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. ధనస్సు రాశి వారి ప్రేమను పొందాలంటే ఓపికగా నిరీక్షించాలి. తొందర పడితే మాత్రం అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
ఈ రాశి వారి మీద ఎటువంటి ఒత్తిడులు చేయకూడదు. ఈ విషయాన్నీ జీవిత భాగస్వామి అర్ధం చేసుకోవాలి. లేకపోతె కొన్ని ఇబ్బందుల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిలో జీవితంలో ఏదైనా సమస్య, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ప్రభావాన్ని వారి జీవిత భాగస్వామి మీద పడకుండా జాగ్రత్తగా ఉంటారు.
ఈ రాశి వారితో ఎంతసేపు మాట్లాడిన బోర్ అనేది కొట్టదు. ఎంతసేపైనా మాట్లాడాలని అనిపిస్తుంది.
ఎదుటి వారిలో ఏదైనా మంచి గుణం కనపడితే దాన్ని ఆచరించటానికి ఇష్టపడతారు. అలాగే నేర్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటారు.
వీరికి తెలిసిన విషయాన్నీ పది మందికి చెప్పాలని కోరుకుంటారు. అలాగే వారు ఆచరించాలని కూడా అనుకుంటారు.
ధనస్సు రాశి వారికి చాలా ప్రశాంతంగా, నిదానంగా జీవితం సాగిపోవాలి. ఎటువంటి గందరగోళం, హడావుడి ఉండకూడదు. ఈ విషయాన్నీ కూడా జీవిత భాగస్వామి అర్ధం చేసుకోవాలి.