telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో తగినన్ని మద్యం నిల్వలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

srinivas goud minister

తెలంగాణలో ఈరోజు మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో ఉన్నతాధికారులతో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం నిల్వలు తగినన్ని ఉన్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో మద్యం ధరలను 75 శాతం పెంచడంతో తప్పని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా 16 శాతం వరకు ధరలను పెంచాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు.

. వైన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. నిబంధనలను పాటించని 28 షాపులపై కేసులు నమోదు చేసి, లైసెన్స్ రద్దు చేసినట్టు చెప్పారు.రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చిందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరిచాయని అన్నారు. మద్యం అందుబాటులో లేకపోవడంతో గుడుంబా మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించామని చెప్పారు.

Related posts