ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ నిలిపివేయాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా’ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఏప్రిల్ 31తో ఎన్నికల వాయిదా గడువు ముగిసింది. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు.