telugu navyamedia
Uncategorized వార్తలు సినిమా వార్తలు

విజయ్-సందీప్ రెడ్డి కాంబోలో వెబ్ సిరీస్…?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ అప్పటినుండి టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక దర్శకుడు సందీప్ ఈ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు జత కట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి సినిమా కాకుండా ఓ వెబ్ సిరీస్ లో. అయితే అందులో విజయ్ నటించడం లేదు. ఆ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించనున్నాడు అని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించనున్నాడు అని సమాచారం. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది . ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది . కాగా కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది .

Related posts