telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ప్రియుడితో పెళ్లి కావాలని ఏకంగా హోర్డింగ్‌ ఎక్కేసిన మైనర్‌ బాలిక…

మధ్యప్రదేశ్‌లో ఓ మైనర్‌ బాలిక ప్రేమ కోసం ఏకంగా హోర్డింగ్‌ ఎక్కేసింది. తాను ప్రేమించిన బాలుడిని పెళ్లి చేసుకుంటానని.. లేకపోతే పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే…ఇండోర్‌ నగరంలోని పర్దేశిపుర ప్రాంతంలోని భండారీ వద్ద ఓ బాలిక హోర్డింగ్‌ ఎక్కడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలికను కిందికి దించే ప్రయత్నాలు చేశారు. అయితే..ఆ బాలిక ససేమిరా కిందికి దిగడానికి ఒప్పుకోలేదు. తాను ప్రేమించిన బాలుడితో పెళ్లి అంగీకరించే వరకు దిగేది లేదని..లేకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగింది. బాలుడితో పెళ్లికి తన తల్లి ఒప్పుకోవడం లేదని…తల్లి ఒప్పుకోకపోయినా సరే…బాలుడితో పెళ్లి చేయాల్సిందేనని ఆ అమ్మాయి పోలీసులకు తెలిపింది. ఆ బాలిక డిమాండ్‌ కు ఓకే చెప్పిన పోలీసులు…ఆ బాలుడిని ఆమె ముందుకు తీసుకువచ్చారు. ఆ బాలుడిని చూడగానే…హోర్డింగ్‌ పై నుంచి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts