ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెండు జిల్లాల మంత్రులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం రెండు జిల్లాల నేతలతో చర్చించారు.
అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా జగన్ పార్టీ నేతలతో మాట్లాడారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనపై ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించి తీరుతుంది: లక్ష్మణ్