telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుపతిలో 1000 మందికి పై కరోనా రోగులు మిస్సింగ్

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి అధికారులకు కోవిడ్ పెషంట్లతో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. వెయ్యి మంది కరోనా రోగుల ఆచూకీ కనిపించడం లేదు. గత రెండు నెలల కాలంలో తిరుపతిలో 9164 పాజిటివ్ కేసులు నమోదు కాగా…ఇప్పటి వరకు 7270 మంది ఆచూకి మాత్రమే గుర్తించారు అధికారులు. 1049 మంది రోగుల ఆచూకీ గల్లంతు అయింది. సంబంధిత ఇంటి నంబర్లలో కూడా జాడ లేని రోగులు… ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. పాజిటివ్ వ్యక్తుల కోసం అధికారులు ట్రేసింగ్ మొదలు పెట్టారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతి వదిలి బయటికి వెళ్లినట్లు గుర్తించారు అధికారులు. శాంపిల్స్ తీసుకునే సమయంలో ఫోన్ నంబర్లు, తాము నివాసం ఉంటున్న చిరునామాలు తప్పుగా ఇస్తున్న బాధితులు… శ్యాంపుల్స్ ఇచ్చాక, ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతునట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ తరహా వ్యక్తులు వైరస్ ను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తున్నారని వాపోతున్నారు అధికారులు.

Related posts