telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నీట్ పీజీ ప‌రీక్ష‌లు వాయిదా…

exam hall entrence

ప్రస్తుతం కారైనా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా చాలా రాష్ట్రా ప్ర‌భుత్వాలు కీల‌క‌మైన టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు కూడా వాయిదా వేయ‌గా.. ఇప్పుడు కోవిడ్ సెగ నీట్‌ను కూడా తాకింది… దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ క‌ల్లోలం నేప‌థ్యంలో.. నీట్ పీజీ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.. 4 నెల‌ల పాటు నీట్ పీజీ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తూ భార‌త ప్ర‌ధాని కార్యాల‌యం నిర్ణ‌యం తీసుకుంది.. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితిలు, క‌రోనా కేసులపై స‌మీక్షించిన పీఎంవో.. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం మంచిది కాద‌ని భావించి.. 4 నెల‌ల పాటు వాయిదా వేసింది. దీని వెనుక మ‌రో కార‌ణం కూడా ఉంది.. ఎంబీబీఎస్ విద్యార్థులను కోవిడ్ సేవల్లో ఉపయోగించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది పీఎంవో… వంద రోజులు కోవిడ్ సేవల్లో పాల్గొన్నవారికి డైరెక్ట్ రెక్రూట్ మెంట్ లో ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్టు.. ప్రధాన మంత్రి కోవిడ్ నేషనల్ సమ్మాన్ అవార్డు కూడా ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొంది. 

Related posts