telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తన కవల పిల్లలను చూసి షాకైన తల్లి… ఎందుకంటే ?

Twins

నైజీరియాలోని లాగోస్‌లో జన్మించిన కవలల్లో ఒకరు నల్లగా.. మరొకరు తెల్లగా పుట్టడంతో వారిని చూసిన తల్లి మొదట షాకైంది. ఫిబ్రవరిలో ఈ వింత ఘటన జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు సైతం కవలలు ఇలా వివిధ రంగుల్లో పుట్టడంపై మొదట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆక్యులోక్యుటేనియస్ ఆల్బినిజం అనే డిజార్డర్ కారణంగానే పుట్టిన కవలల్లో ఒకరు తెల్లగా, గోల్డ్ హెయిర్‌తో పుట్టినట్టు తరువాత డాక్టర్లు తెలుసుకున్నారు. తమ కెరీర్‌లో కవలలు ఈ విధంగా పుట్టడం ఎన్నడూ చూడలేదంటూ డాక్టర్లు చెప్పారు. తమ పిల్లలు ఇలా వివిధ రంగుల్లో పుట్టడం తమకు చాలా ఆనందంగా ఉందంటూ తల్లి స్టాసీ, ఆమె భర్త చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులిద్దరూ నల్లగా ఉంటే.. పుట్టిన పిల్లోడు తెల్లగా ఉన్నాడేంటంటూ చుట్టాలు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారంటూ స్టాసీ చెప్పుకొచ్చింది. తాను ఎక్కడికి వెళ్లినా తన ఇద్దరు కొడుకులను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారంటూ స్టాసీ ఆనందం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు తన కొడుకులతో ఫొటోలు దిగడానికి తాపత్రయం పడుతున్నారని చెబుతోంది. తాము ఉంటున్న ప్రాంతంలో తన కొడుకులు సెలబ్రిటీలు అయిపోయారంటూ చెప్పుకొచ్చింది.

Related posts