telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నారప్ప” యాక్షన్ సీన్స్ కోసం రంగంలోకి మరో దర్శకుడు ?

Narappa

తమిళంలో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ధనుష్ `అసురన్` సినిమా తెలుగులోకి రీమేక్ అవుతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు `నారప్ప` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల విడుదలైన వెంకటేష్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామాకు, ఎమోషన్లకు ఎంత ప్రాధాన్యం ఉందో, యాక్షన్ సన్నివేశాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. శ్రీకాంత్ అడ్డాల ఇప్పటివరకు తెరకెక్కించిన ఏ చిత్రంలోనూ యాక్షన్ సన్నివేశాలు లేవు. అందుకని `నారప్ప`లోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మరో దర్శకుడు రంగంలోకి దిగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వెంకటేష్ హీరోగా `వెంకీ మామ` రూపొందించిన దర్శకుడు బాబి `నారప్ప` యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడని టాక్ బయటకు వచ్చింది. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts