telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 28, గురువారం రాశిఫ‌లాలు..

మేష రాశి..
పనులు నెమ్మదిగా కొనసాగుతాయి… ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి… దూరప్రయాణాలు… వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీవితంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి.మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.

వృషభ రాశి..
సంఘంలో గౌరవప్రతిష్ఠలు ల‌భిస్తాయి. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. గొంతు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది… అందుకని చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి.

మిధున రాశి..
బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు.. పెద్దల ఆస్థి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభవార్త వింటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. అనవసర విషయాల్లో తలదూర్చడంవలన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.వాహనం నడుపునపుడు మెళకువ చాలా అవసరం.

కర్కాటక రాశి..
మీ సంతానం మొండివైఖరి మీపై ఎంతో ఒత్తిడి పెంచి, చికాకు కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు ఉంటాయి. పట్టుదలతో చేపట్టిన కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

సింహ రాశి..
వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.

కన్య రాశి..
రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మిత్రులతో సఖ్యత. విందువినోదాలు పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొంటారు. కొత్తపనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది.

తులా రాశి..
ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి ఆఫర్ లభిస్తుంది. సోదరుల నుంచి ధనలాభం.

వృశ్చిక రాశి..
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అదృష్టం కలిసి వస్తుంది.కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు.జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

ధనుస్సు రాశి..
ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభం వ‌స్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీలైనంత వరకూ స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి..
రాజకీయనాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ప్రేమ, మద్దతు పొందుతారు. వీలైనంత వరకు అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆలయ దర్శనాలు చేస్తారు.

కుంభ రాశి..
కోర్టు కేసుల నుంచి బయటకు వస్తారు. .కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.ఆస్తుల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.

మీన రాశి..
కుటుంబంలో ఒత్తిడులు వ‌స్తాయి. విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. దూరప్రయాణాలు చేస్తారు.

Related posts