telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 7, శుక్రవారం రాశిఫ‌లాలు

మేషరాశి..

కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ముఖ్య‌మైన‌ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. పెద్దల సలహాలు పాటించాలి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల‌తో ఆనందంగా గడుపుతారు. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోవ‌డం మంచిది కాదు.

వృషభరాశి..

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్ద‌లు సూచ‌న‌లు పాటించ‌డం మంచిది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలతో కొత్త పనులను ప్రారంభించాలి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల‌లో ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిథునరాశి..

దూరప్రయాణాలు చేస్తారు. బంధువులతో గొడ‌వ‌లు ఏర్ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనులు మొదలుపెడితే.. మేలు జరుగుతుంది. సన్నిహితుల నుంచి అవసరానికి తగిన సాయం అందుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేయ‌డం మంచి జ‌ర‌గుతుంది.

కర్కాటకరాశి..

ఆరోగ్యం మంద‌గిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి సహకారం అందుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించ‌డం మంచిది. విద్యార్థులకు త‌మ లక్ష్య సాధ‌న‌ పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

సింహరాశి..

ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో తోటివారి సలహాలు సూచనలు పాటిస్తే మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సామాజంలో కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. దైవ కార్యాల‌యాల్లో పాల్గొంటారు.

కన్యరాశి..

ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది. మనోధైర్యంతో చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ మ‌న‌సుకు ఇష్టమైన వారితో సరదాగా గడుపుతారు. అవసరానికి అనుగుణంగా ముందుకుసాగాలి.

తులరాశి..

దైవదర్శనాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు అధిక‌మ‌వుతాయి. ఆరోగ్యంపై దృష్టిపెట్ట‌డం మంచిది. వ్యాపారాలు అంతగా కలసిరావు. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా ప్ర‌వ‌ర్తించ‌డం మంచిది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.

వృశ్చికరాశి..

రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. సోదరులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి..బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. విద్యార్ధులు చ‌దువు మీద శ్ర‌ద్ద త‌ప్పుతుంది.

ధనుస్సురాశి..

కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గడుపుతారు. స్నేహితులతో కలిసి భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటించాలి. వేరే వారి అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరరాశి..

డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. ఉద్యోగస్తుల‌కు మీ కార్యాల‌యాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ద వ‌హించాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభరాశి..

స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. ధ‌న‌, వస్తులాభాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య భూవివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వేరే గొడవల్లో దూరంగా ఉండ‌డం మంచిది. తెలియ‌ని వ్యక్తుల విషయంలోను అప్రమత్తంగా మెల‌గ‌డం మంచిది.

మీనరాశి..

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో పై అధికారులు నుంచి ఇబ్బందులు ఎదురైనా పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆస్తి విషయంలో చికాకులు ఎదురువుతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేయ‌డం మంచిది..

Related posts