telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

మే 10 సోమవారం దినఫలాలు : పద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు

మేషం : రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికంగా ఉంటాయి. స్త్రీలకు విలాస వస్తువులు అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. అధికారులకు కింది స్థాయి సిబ్బంది సాదర వీడ్కోలు పలుకుతారు. ఆపద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

వృషభం : సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయడం శ్రేయస్కరం.

మిథునం : వృత్తిపరంగా ఆదాయాభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ప్రేమికుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవడంతో ప్రశాంతత చేకూరి ఉల్లాసంగా గడుపుతారు.

కర్కాటకం : మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. మీ లక్ష్య సాధనకు బాగా కష్టపడాలి. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరించుకోవడం ఉత్తమం.

సింహం : స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. అధికారులతో కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.

కన్య : వైద్యులకు ఆపరేషన్లు నిర్వహించునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి.

తుల : ఒక స్థిరాస్తిని విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.

వృశ్చికం : ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు. దైవ కార్యాలపై ఆసక్తి నెలకొంటుంది. కీలకమైన వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

ధనస్సు : ఎల్.ఐ.సి. పోస్టల్ ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. బ్యాంకు పనులు చికాకును కలిగిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

మకరం : కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో ఉపశమనం పొందుతారు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థుల్లో నూతన ఊత్సాహం చోటుచేసుకుంటుంది. ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. ప్రేమికులకు నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది.

కుంభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ప్రముఖులు స్త్రీలతో మితంగా సంభాషించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు.

మీనం : ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. రాజకీయ నేతలు తమ వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు అవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.

Related posts