మేషరాశి..
నూతన కార్యాలయాలకు శ్రీకారం చూడతారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. స్నేహితులతో విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభరాశి..
శ్రమకు తగ్గ ఫలితం లభించదు. నిరోద్యోగస్తులకు ఉద్యోగవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల నుంచి గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. అనారోగ్యం బారిన పడతారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిథునరాశి..
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ధనలాభం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులు మంచి కాలం నడుస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్ధులు శ్రమించాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటకరాశి..
నిరోద్యోగులకు నూతన ఉద్యోగవకాశాలు లభిస్తాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు . విందువినోదాల్లో పాల్గొంటారు. మీకు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కొన్ని కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆనారోగ్యం బాధిస్తుంది.
సింహరాశి..
ఆర్థికంగా మెరుగుపడతారు. మీరు అనుకున్న పనుల్లో అవంతరాలు ఏర్పడతాయి. అనారోగ్యం సూచన. కుటుంబంలో ఒత్తిడులు ఏర్పడతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడిలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేస్తారు.
కన్యరాశి..
బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. భూవివాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి ఉంటుంది. పిల్లులు ప్రవర్తనతో విసుగు చెందుతారు.
తులరాశి..
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులు నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి సమయం ఆసన్నమైంది. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికరాశి…
వ్యాపార రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల కలయిక ఏర్పడుతుంది.. విందువినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ప్రత్యర్థులపై మీదే పైచేయి ఉంటుంది.. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
ధనుస్సురాశి..
బంధువుల నుంచి వివాదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి తగాదాలు కొలక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ధనవ్యయం అధికంగా ఉంటుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు ఆఫీసుల్లో తొటివారితో తగాదాలు ఏర్పడతాయి.
మకరరాశి…
ఆడవారికి పని భారం అధికమవుతుంది. ఇంటబయట కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం మంచిది.
కుంభరాశి..
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం కలుగుతుంది. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి కాలం నడుస్తుంది. విద్యార్ధులు చదువు మీద శ్రద్ధ చూపిస్తే మీరు అనుకున్నగోల్‌రి రీచ్ అవుతారు.
మీనరాశి..
ముఖ్యమైన పనులు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపడతారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు తోటి వారితో వివాదాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.