telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … పనులు సకాలంలో పూర్తిచేస్తారు.. కొత్త పరిచయాలు ..

today rasi falalu

మేషం : మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం : కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో గందరగోళం

మిథునం : పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం : బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం : శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీపై కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

కన్య : ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

తుల : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి.

వృశ్చికం : కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు : మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు

మకరం : కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం : వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు.

మీనం : పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.

Related posts