telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 30, మంగళవారం రాశిఫలాలు

మేషరాశి..

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.

వృషభరాశి..

అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. దైవదర్శనాలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి.గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి.

మిథునరాశి..

చేపట్టిన పనుల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. కుటుంబంలో సమస్యలు ఎదుర‌వుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కర్కాటకరాశి..

బంధు మిత్రుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందువినోదాలు పాల్గొంటారు. శ్రమకు త‌గిన ఫ‌లితం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది.

కన్యరాశి..

స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు అధిగమిస్తారు.కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది .దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తులరాశి..

కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. సోదరులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డుతుంది. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికరాశి..

శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి . భూములు, వాహనాలు కొంటారు. సన్నిహితులతో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సురాశి..

ఖర్చులు పెరగడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. పరిచయాలు విస్తృతమవుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.మీలోని ఓర్పు,సహనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి.

మకరరాశి..

మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తినిస్తుంది. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంత‌గా అనుకూలించ‌వు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

కుంభరాశి..

వ్యాపారాభివృద్ధికి చేయు యత్నాలు సత్ఫలితాలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు.ఎవరినీ అతిగా నమ్మకండి.

మీనరాశి..

దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యం సాధిస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలు దక్కవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.

Related posts