telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 9 (సోమ వారం) రాశి ఫలాలు

మేషం: చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కార్యాలయాల్లో నూతన బాధ్యతలు చేపడతారు. ఆత్మీయుల సలహా మేలు చేస్తుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృజనాత్మక పనిలో మీ ఆసక్తి పెరుగుతుంది. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది.

వృషభం: మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల సలహా తీసుకోండి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. దైవబలం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు చూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మిథునం: వ్యాపార భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పాత అప్పులు తీరుస్తారు. మీమీ రంగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పని ఒత్తిడిలో కుటుంబ సభ్యులను విస్మరించొద్దు. ఉద్యోగ రంగంలోని వారికి కొత్త అవకాశాలుండే అవకాశం. బంగారు భవిష్యత్తుకు వ్యూహరచన చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు.

కర్కాటకం: పాత బాకీలు వసూలు అవుతాయి. ఆస్తి కొనుగోలు ఒప్పందాన్ని పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. పరిచయంలేని వారి మాటలు వినకండి. మానసిక ఒత్తిడి ఉంటుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపార కార్యకలాపాల్లో అడ్డంకులు ఎదురుకావొచ్చు. నూతన సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది.

సింహం: ధృడమైన మనస్సుతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఇష్టమైన వారి సలహాలు తీసుకుంటారు. కొన్నిసార్లు ఇతరుల మాట వినడం మంచిదికాదు. వ్యాపార రంగాల్లో విజయం లభిస్తుంది. ఆస్తి సంబంధిత వివాదాన్ని పరిష్కరిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు.

కన్య: ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పని నెరవేరుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు. కార్యాలయంలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్నేహితుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

తుల: ఓ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది

వృశ్చికం: చేపట్టిన కార్యాల్లో అలసట పెరుగుతుంది. వ్యాపారాల్లో ఇతరుల సలహా తీసుకుంటారు. ఇంటికి సంబంధించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారంలోని కొన్ని సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక సంఘర్షణకు గురయ్యే విషయాలనుంచి దూరంగా ఉండండి.

ధనస్సు : ఉత్సాహంగా చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. విద్యార్థులు ఏకాగ్రత వహించాలి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్నిస్తాయి. కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కార్యాలయాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

మకరం: చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వివాహం గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి. మీమీ రంగాల్లో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణాలు ఇస్తే తిరిగి రావడం కష్టం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఉపాధి రంగంలోని వారికి చికాకులు తప్పవు. కుటుంబ ఖర్చులను తగ్గించుకోవాలి.

కుంభం: వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభప్రదమైన ఖర్చులు చేస్తారు. శుభవార్తలు వింటారు. రాజకీయాల్లోని వ్యక్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మీనం: చంచల స్వభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్య విషయాల్లో ముందుచూపు అవసరం. పొదుపు పథకాల్లో పెట్టుబడికి అనుకూలం. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తోటివారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధువులతో జాగ్రత్త.

Related posts