telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చవకబారు ప్రచారం తాను కోరుకోను: కేసీఆర్

telangana cm kcr on CAA

చవకబారు ప్రచారం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో సరకు రవాణా చేసే కార్గో బస్సులపై కేసీఆర్ ఫొటోలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోందన్న వార్తలు రావడంతో ఆయన స్పందించారు.

బస్సులపై ఫొటోలతో ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం తనకు లేదని అన్నారు. ఇలాంటి అంశాలను తాను ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు.కార్గో బస్సులపై సీఎం ఫొటోలు వద్దంటూ ఆర్టీసీకి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే పథకాల్లో భాగంగా కొత్తగా కార్గో బస్సులను తీసుకువస్తున్నారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ బస్సులను ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Related posts