తమిళనాడులో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రచారం ఊపందుకుంది. డీఎంకే నేత స్టాలిన్ పెరంబూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. డీఎంకే నేత స్టాలిన్ కూతురి ఇంట్లో ఐటి దాడులు జరగడం పట్ల అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేను కాపాడేందుకు కేంద్రం జిమ్మిక్కులు చేస్తోందని అన్నారు. అన్నా డీఎంకేపైన, బీజేపీపైనా తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్ని ఎత్తులు వేసినా విజయం తమదే అని స్టాలిన్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు ప్రధాని మోడీ మధురైలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మధురైలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. కొన్నేళ్ల క్రితం తన సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి మధురైకు అనేకమంది వచ్చారని, వారందరిని అక్కడి ప్రజలు ఆదరించి తమలో భాగంగా చూసుకున్నారని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ అని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని ప్రధాని పేర్కొన్నారు. 2016 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జల్లికట్టును బ్యాన్ చేయాలని తన మ్యాన్ ఫెస్టోలో పేర్కొన్నారని, కానీ, కాంగ్రెస్ తో కలిసి అప్పట్లో డీఎంకే పోటీ చేసిందని అన్నారు. అయితే, తాము జల్లికట్టు విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని అన్నాడీఎంకేను కోరినట్టు తెలిపారు.
previous post
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !