telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్‌లో వెలిసిన రాహుల్ గాంధీ బ్యాన‌ర్లు…

*హైద‌రాబాద్‌లో వెలిసిన బ్యాన‌ర్లు…
*గ‌తంలో కేటీఆర్‌కి కాంగ్రెస్ నేత‌లు స‌వాల్‌
*ఇప్పుడు రాహుల్ గాంధీ జీ వైట్ ఛాలెంజ్‌కు సిద్థమా అంటూ వెలిసిన‌ ప్లెక్సీలు..

హైదరాబాద్‌ నగరంలో అక్కడక్కడ వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ జీ వైట్ ఛాలెంజ్‌కు సిద్థమా అంటూ ప్లెక్సీలు వెలిశాయి.నగరంలోని ట్యాంక్ బండ్ , గన్ పార్క్ వద్ద ఈ మేరకు ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.

శుక్ర‌వారం రాహుల్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ప‌లు ప్రాంతాల్లో వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

గతంలో హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటన నేపథ్యంలో కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ నేత‌ల‌ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరిగాయి.

రాహుల్ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…. మంత్రి కేటీఆర్‌ను వైట్ ఛాలెంజ్‌కు ప్రతి సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఆ త‌రువాత స‌ద్దు మ‌ణిగిన వివాదం ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది.ఇటీవ‌ల నెపాల్‌లో ఓ పెళ్ళి వేడుక‌లో పాల్గొన్న రాహుల్ వీడియో వైర‌ల్ కావ‌డంతో.. ఆ ఫోటోతోనే బ్యాన‌ర్లు ఫ్రింట్ చేయించారు. ఆర్ యు రెడీ అంటూ రాహుల్ ని ఛాలెంజ్ చేస్తున్నారు 

Related posts