‘అగ్నిపథ్’ ఆందోళనలతో రణరంగంలా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నుండి తరలించారు. స్టేషన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.
దాదాపు 9 గంటల సుదీర్ఘ ఉద్రిక్తతల అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీంతో అధికారులు షెడ్యూల్ రైళ్లను పునః ప్రారంభించారు.
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది . ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌తో పాటు హైదరాబాద్ మెట్రో సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
అయితే ప్రస్తుతం నిరసనకారులు శాంతించడం, పరిస్ధితి అదుపులో వుండటంతో సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలను రైల్వే శాఖ పునరుద్ధరించింది. దీనిలో భాగంగా లింగంపల్లి నుంచి కాకినాడకు వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రాత్రి 7.40కి బయల్దేరనుంది. విశాఖ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.20కి బయల్దేరనుంది.