telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ జిల్లాలో కరోనా టెస్టులు పెంచాలి : హైకోర్టు

తెలంగాణ కరోనా పరిస్థితుల పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా కేసుల వివరాలు ప్రతి రోజు మీడియా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు పేర్కొంది. యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి చాలా కేసులు నమోదు అవుతున్నాయని, కాబట్టి ఈ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలని హైకోర్టు పేర్కొంది. వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారని, వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు పేర్కొంది. కోవిడ్ నియంత్రణ సూచనలు  చేయడానికి  ప్రత్యేక కమిటీ వేయాలని, నైట్ కర్ఫ్యూ  విధించడం కాదు..ప్రజలు డే టైం లో పబ్లిక్ ప్లేస్ లలో తిరగకుండా చూడాలని అన్నారు. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని అన్నారు. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. మ్యారేజ్ ఫంక్షన్స్ , పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలన్న హైకోర్టు, మున్సిపల్ ఎన్నిక సమయంలో  భౌతిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. ఎన్నికల ర్యాలీలలో జనాభా అధికంగా ఉండకుండా చూడాలని ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, నేషనల్ హైవే ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొంది.

Related posts