telugu navyamedia
రాజకీయ

హీరాబెన్ మోదీ 100వ పుట్టినరోజు…తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

దేశానికి ప్ర‌ధాని మంత్రి అయినా త‌ల్లి కొడుకే క‌దా..అందుకేప్ర‌ధానిగా ఎంత బిజీగా ఉన్నా స‌రే..వీలు చేసుకుని మ‌రీ త‌న తల్లిని క‌లిసి ..క‌బుర్లు చెబుతూ కాసేపు గ‌డిపి వ‌స్తుంటారు.

Prime Minister Narendra Modi met his mother Heeraben Modi on her birthday at gandhi nagar

నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శ‌త వ‌సంతంలోకి అడుగుపెట్టారు. 1923 జూన్‌ 18న ఆమె జన్మించారు. గుజరాత్​ పర్యటనలోనే ఉన్న మోదీ.. గాంధీనగర్​లోని తన నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఆమెతో కలిసి ఇంట్లోనే పూజామందిరంలో ప్రత్యేక పూజలు చేశారు .

Prime Minister Narendra Modi met his mother Heeraben Modi on her birthday at gandhi nagar

అనంత‌రం తన తల్లి కాళ్లను కడిగిన మోదీ ఆ నీళ్లను కళ్లకు అద్దుకున్నారు. తల్లికి మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి హీరాబెన్‌ చిరకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ.. మోదీ స్వస్థలమైన వడ్‌నగర్‌లోప్రత్యేక పూజలు చేశారు.

 

ఈ సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ప్ర‌ధాని ట్వీట్​ చేశారు. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్​ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.

Prime Minister Narendra Modi met his mother Heeraben Modi on her birthday at gandhi nagar

హీరాబెన్ మోదీ 1923 జూన్‌ 18న జన్మించారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ (పీఎం మోడీ సోదరుడు)తో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తోంది. హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్‌కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. అదే ఆమె ఆరోగ్య రహస్యం కావచ్చు.

Prime Minister Narendra Modi met his mother Heeraben Modi on her birthday at gandhi nagar

ప్రధాని మోదీ తల్లి ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు.తాను తినే ఆహారాన్ని తానే వండుకోవడానికి ఇష్టపడుతుంటారని సమాచారం. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం ఆమెకు ఇష్టం ఉండదు. ఆమె రోజువారీ ఆహారంలో పప్పు, అన్నం, కిచడీ చపాతీ ఉంటాయి. చక్కెర మిఠాయి తినడానికి ఆమె ఇష్టపడతారని చెబుతుంటారు. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా మంది ప్రజలు భయపడినపుడు,మోదీ తల్లి వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ఈ వయస్సులో, ఆమె వ్యాక్సిన్ పొందడం ద్వారా ప్రజల మనస్సులోని భ్రమలను తొలగించడానికి ప్రయత్నించారు.

Related posts