telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సంచలనం సృష్టించిన ఆ హత్య కేసులో తీర్పు…

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. అయితే ఈ ఘటన తరువాత ఆ దేశంలో ఉద్యమం జరిగింది. బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో పెద్ద ఎత్తున అమెరికాలో ప్రజలు ఉద్యమించారు.  లాఠీ ఛార్జ్, కాల్పులు జరిగాయి.  ఈ ఘటనకు కారణమైన పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా, కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పును అమెరికా కోర్టు వెలువరించింది.12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది.  ఈ విచారణ అనంతరం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.  జార్జ్ ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ కారణమని తీర్పు ఇచ్చింది.  సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, నరమేధ హత్యగా దీనిని కోర్టు పేర్కొన్నది.  కోర్టు తీర్పు సమయంలో బయట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.  తీర్పు అనంతరం ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts