telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : .. పండ్ల మార్కెట్ లో .. దళారీల పెత్తనం..

mediators role in market yard

గడ్డిఅన్నారం మార్కెట్‌లో బొప్పాయి రైతుపై దాడి ఘటన సంచలనం కలిగించింది. మార్కెట్‌కు వస్తున్న రైతులకు కమీషన్ ఏజెంట్లతో పాటుగా దళారులు నట్టేట ముంచుతున్నారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోనే పోలీస్‌స్టేషన్ ఉన్నా, మార్కెట్ కమిటీకి ప్రత్యేక సెక్యూరిటీ విభాగం ఉన్నప్పటికీ ఈ దళారుల, పండ్ల దొంగల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. బొప్పాయికి బాగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పండ్ల మార్కెట్‌లోని మధ్య దళారులు బొప్పాయి కాయలపై తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

యార్డుకు ప్రతి రోజు సుమారు 70 టన్నుల వరకు బొప్పాయి సరుకు వస్తోంది. ఈ మధ్యదళారులు, రిటైల్ వ్యాపారుల ముసుగులో వచ్చే వారు ఓ ముఠాగా ఏర్పడి పండ్లను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన రైతు సరుకులో నుంచి రెండు, మూడు బొప్పాయిల చొప్పున తమ వాటాగా దర్జాగా తీసుకుని పక్కన ఓ కుప్పగా వేసుకుని అనంతరం అమ్ముకుంటున్నారు. గతంలో మామిడి సీజన్‌తోపాటుగా బత్తాయి సీజన్‌లోనూ రైతులను బెదిరించి సరుకును కాజేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఒక్కోసారి పండ్ల వాహనాలు మార్కెట్ యార్డులోకి వస్తున్న క్రమంలోనే వాహనంపైకి ఎక్కి సరుకును తస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎదిరించిన రైతులకు గతంలోనూ మారణాయుధాలతో బెదిరించిన ఘటనలపై మార్కెటింగ్ అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. అయినప్పటికీ సదరు అల్లరి మూకలు, దళారుల మాటున పండ్ల దొంగలను పూర్తిగా అడ్డుకోవడంలో అధికారులు, సెక్యూరిటీ విభాగం వారు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు దళారులు ఏకంగా రైతుపైనే దాడికి దిగడం గమనార్హం.

Related posts