telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

కర్ణాటక మాజీ సీఎం రెండో భార్యకు కష్టాలు …

మాజీ సీఎం రెండో భార్య, ఫేమస్ హీరోయిన్ రాధిక కుమారస్వామికి సినిమా కష్టాలు .. రాజకీయ నాయకుల పేరుతో అనేక మందికి మోసం చేసిన చీటింగ్ కేసుల్లో అరెస్టు అయిన నకిలి ఆర్ఎస్ఎస్ లీడర్ స్వామి బ్యాంకు ఖాతాల నుంచి ప్రముఖ నటికి కోట్ల రూపాయల నగదు బదిలి అయ్యిందని గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నటి రాధిక కుమారస్వామిని విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో మాజీ సీఎంతో పాటు ఆయన వర్గీయులు షాక్ అయ్యారు.

భారత మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిని ప్రముఖ నటి రాధిక కుమారస్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. హెచ్.డీ. కుమారస్వామి రెండుసార్లు కర్ణాటకకు ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సీఎం కుమారస్వామి మొదటి భార్య అనితా కుమారస్వామి కూడా జేడీఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చరుకుగా రాజకీయాల్లో ఉన్నారు.

ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని అనేక మందికి కుచ్చుటోపీ పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలి ఆర్ఎస్ఎస్ లీడర్ యువరాజ్ అలియాస్ యువరాజ్ స్వామి అలియాస్ స్వామిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో యువరాజ్ స్వామి గురించి అనేక షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

నకిలి ఆర్ఎస్ఎస్ లీడర్ యువరాజ్ బ్యాంకు అకౌంట్ ల నుంచి కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం రెండో భార్య రాధిక కుమారస్వామికి చీటింగ్ కేసులో అరెస్టు అయిన యువరాజ్ బ్యాంకు ఖాతాల నుంచి ఎందకు నగదు లావాదేవీలు జారిగాయి ? అనే విషయం క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

శుక్రవారం విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. యువరాజ్ అలియాస్ స్వామి ప్రముఖ నటి, మాజీ సీఎం భార్య రాధిక కుమారస్వామికి ఎందుకు నగదు బదిలి చేశారు అనే విషయంపై వివరాలు సేకరించడానికి ఆమెకు నోటీసులు జారీ చేశామని బెంగళూరు సీసీబీ విభాగం జాయింగ్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు.

సీసీబీ పోలీసులు అరెస్టు చేసిన యువరాజ్ అలియాస్ స్వామికి తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, రాజకీయ సంబంధాలు లేవని నటి రాధిక కుమారస్వామి ఇప్పటికే వివరణ ఇచ్చారు. యువరాజ్ అలియాస్ స్వామి మా కుటుంబ సభ్యులకు 17 సంవత్సవరాల నుంచి పరిచయం ఉందని, ఆయనతో తనకు ఎలాంటి ఆర్థికలావాదేవీలు లేవని రాధిక కుమారస్వామి స్పష్టం చేశారు.

చారితాత్మక సినిమా నిర్మాణం కోసం యువరాజ్ రూ. 15 లక్షలు, మరో సినిమా నిర్మాత రూ. 60 లక్షలు తనకు అడ్వాన్స్ గా ఇచ్చారని ఆమె అంటున్నారు. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాధిక కుమారస్వామి సోదరుడు రవిరాజ్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. మొత్తం మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడిగే ప్రశ్నలకు మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి వివరణ ఇవ్వడానికి సిద్దం కావాల్సి ఉంది.

Related posts