telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికాను మళ్లీ భాగస్వామి చేసిన బైడెన్‌…

Joe Biden USA

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన జో బైడెన్‌ నిన్న ఆ పదవి బాధ్యతలు స్వీకరించాడు. అయితే బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అందులో పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికాను మళ్లీ భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బైడెన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.. వాతావరణ మార్పులను అణచివేసేందుకు ప్రపంచం చేస్తున్న ప్రయత్నాల్లో అమెరికా మళ్లీ చేతులు కలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ నేతలు. దీనిపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్,  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యులేయ్ మేక్రాన్ మరియు జపాన్‌ కూడా స్పందించింది. అమెరికా.. పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరడం సానుకూల వార్త అని జాన్సన్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని  వెల్లడించగా.. బైడెన్‌ యంత్రాంగంతో కలిసి పనిచేస్తామన్నారు. ఇక, మేక్రాన్ స్పందిస్తూ.. వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము మరింత బలోపేతం అయ్యామని… భవిష్యత్తును నిర్మించేందుకు, ఈ భూమిని రక్షించుకునేందుకు మరింత బలోపేతం అయ్యామని పేర్కొన్నారు.. కాగా, డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వెళ్ళిపోయింది.

Related posts