telugu navyamedia
వ్యాపార వార్తలు సినిమా వార్తలు

గ్లామర్ తో అదరగొడుతున్న వింక్ గర్ల్

Priya Prakash Varrier New Commercial Add
ఒక్క కన్నుగీటుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ కేరళ కుట్టి “లవర్స్ డే” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు ఓ కమర్షియల్ యాడ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ కు సంబంధించిన చిత్రాలను ప్రియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ పిక్స్ లో ప్రియా గ్లామర్ గా అందంగా కన్పిస్తోందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ కు సంబంధించిన ఫొటోల్లో ప్రియా ప్రకాష్ తో పాటు హీరోయిన్ స్నేహా ఉల్లాల్, బిగ్ బాస్ సీజన్-12 పోటీదారు కృతివర్మ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “లవర్స్ డే”తో మెప్పించలేక విమర్శలపాలైన ఈ బ్యూటీ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది.

Related posts