telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజినీకాంత్ చాలా గంభీరంగా చెప్పారు… గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ లేదు… నాగబాబు కామెంట్స్

Nagababu

జనసేన లీడర్, మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తాజాగా దేవుడు చచ్చిపోయాడంటూ సంచలన కామెంట్ చేశారు. అసలు దేవుడే లేడంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దేవుడ్ని, రజనీకాంత్ చెప్పిన డైలాగుల్ని నాగబాబు ప్రస్తావించడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. అది ఏంటంటే “మన కంటికి కనబడే ఏదయినా ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే అయివుంటది. లేకపోతే ఆ వస్తువు కి ఉనికి ఉండదు.అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికి లో ఉందంటే ఎవరో ఒక క్రియేటర్ వుండే ఉండాలి. అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పారు” అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. దీనికి కంటిన్యూగా ఆయన మరో ట్వీట్ కూడా చేశారు. “మరి అంత క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు? ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి. ఆ రీజన్ దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్ కి ఇంకో రీజన్ ఉండాలి. సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు. సో గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏది లేదు. సో లెట్స్ లివ్ అవర్ లివ్స్ వితౌట్ ది ఇన్వొల్వెమెంట్ ఆఫ్ గాడ్ కాన్సెప్ట్.. నెట్జాగ్ చెప్పినట్లు” ది గాడ్ ఈజ్ డెడ్ అంటూ ఆయన పోస్టు చేశారు. ఇలా వరుసగా మూడు ట్వీట్లు పెట్టారు నాగబాబు.

Related posts