telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ ప్రారంభించిన బాలయ్య

NBK

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా ఇప్పుడు ఎట్టకేలకు బాలయ్య మరియు బోయపాటిలు ఈ చిత్రం తాలూకా షూట్ ను షురూ చేసేసారు. ఇటీవలే చెప్పిన విధంగా ఈరోజు అక్టోబర్ 29 నుంచి రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసేసినట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.

Related posts