telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మందారం….ఎంత సింగారం !

మందారం!
అబ్బో.. ఎంత సింగారం
తొంగిచూసే
తూర్పు సందెలా
– గర్వంగా!
మల్లి!
మత్తుజల్లే మిడియాలం
నింగిదుప్పికి
తెల్ల చుక్కల్లా
– కొమ్మల్లో!
గులాబీ!
లాబీల్లో భలే చలాకీ
‘కళ’కలంలో
మహా కిలాడీ
– జడ కొప్పుల్లో రౌడీ!
చంపకం!
సుగంధాల పంపకం
రెప్పల కప్పలుగ
విచ్చిన కుందనం
– గమ్మత్తుల ఇంధనం!
మొగలి!
పరిమళాల రగిలి
బొంకులాడ పొగిలి
శివుడి కన్ను తగిలి
– దిక్కులేక మిగిలి!
ఉత్ఫలాలు
కస్తూరికాలు
జాతి పారిజాతాలు
సౌగంధికా సహస్రాలు
దేవగంధాలనగ,
ప్రకృతమ్మ పంపకాలె..
అన్నిటికీ అందలాలె!
అందుచున్నవవిగొ..
అంగజాంగికి
సకల చందనాలనుచు
– మంచుముత్యాల ఒడిసి తడిసి!

Related posts