telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఉచితంగా … సివిల్స్ కోచింగ్.. : ఏకే ఖాన్

free civils coaching to minarity

తెలంగాణ మైనార్టీ సంక్షేమశాఖ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచింగా కోచింగ్ ఇవ్వడానికి ముందుకువచ్చింది. అందుకు సంబంధించి బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సలహాదారు ఏకే ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 100 మంది మైనార్టీ అభ్యర్థులను ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సంస్థలు అనలాగ్, బ్రెయిన్‌ట్రీ, ఆర్సీరెడ్డి, విజన్ ఐఏఎస్ సంస్థల్లో కోచింగ్ తీసుకోవడానికి అభ్యర్థులకు అవకాశమిచ్చారు. అందుకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని, పైగా స్కాలర్‌షిప్ కూడా అందిస్తామని మైనార్టీశాఖ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆ శాఖ డైరెక్టర్ షానవాజ్‌ఖాసీం మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్న తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సెక్రటరీ బీ షఫీవుల్లాఖాన్ మాట్లాడుతూ.. మైనార్టీ అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికైతే తిరిగి ఆ వర్గం సంక్షేమానికి బాగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు.

Related posts