telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కులం పేరుతో ప్రజలను విడగొట్టదు: పవన్‌ కల్యాణ్‌

కులం పేరుతో ప్రజలను విడగొట్టదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా నేతలతో ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతీయతను నమ్ముకుని తాను రాజకీయాల్లోకి రాలేదని, మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మన వ్యవస్థలోకులాల ఆలోచనలు, వాటి మధ్య ఘర్షణలను అధిగమించకపోతే సామాజిక వినాశనం తప్పదన్నారు. జనసేన సమాజ వికాసం కోసమే పని చేస్తుందని  పవన్‌ వ్యాఖ్యానించారు.
 చదువు నేను ఇంటర్‌తోనే చదువు ఆపేసినా రోజుకు కనీసం 8 గంటలపాటు చదువుతూనే  ఉంటానని తెలిపారు. మార్క్స్‌ నుంచి కాన్షీరాం వరకూ, నక్సలిజం, మండల్‌ రిజర్వేషన్లు, రామజన్మభూమి వివాదం, సోవియట్‌ పతనం, సైన్స్‌-టెక్నాలజీ వంటి అనేక విషయాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొన్నాని పేర్కొన్నారు. జనసేన నాయకుడిగా నా నడక ఎలా ఉంటుందో కార్యకర్తలకు తెలియజేసిన తర్వాత నా దారిలో నడవాలని చెప్పడానికి నాలుగేళ్ల సమయం తీసుకున్నని అన్నారు. అందరి సమస్యలకూ పరిష్కారమార్గం చూడాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Related posts