telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎల్ఆర్ఎస్ గడువు పెంచిన ప్రభుత్వం..ఎప్పటివరకంటే

sankranthi holidays in telangana

అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్‌ఆర్ఎస్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది.. అయితే, కరోనా సమయంలో ఈ స్కీమ్‌పై కొన్ని విమర్శలు ఉన్నా.. స్పందన బాగానే ఉంది.. కానీ, పూర్తిస్థాయిలోమాత్రం ఎస్‌ఆర్‌ఎస్‌ కు దరఖాస్తు చేసుకోలేదు.. అయితే, దరఖాస్తు దారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ.. మరోసారి గడువును పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.. అక్టోబర్ 15వ తేదీ ఫైనల్ అని గతంలో ప్రకటించినా… భారీ వర్షాల కార‌ణంగా అనేక చోట్ల విద్యుత్‌ సర‌ఫరా నిలి‌చి‌పో‌యింది. ఇంట‌ర్నెట్‌ సేవ‌లకు అంత‌రాయం ఏర్పడింది.

దీంతో చాలా‌చోట్ల భూ యజ‌మా‌నులు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు దర‌ఖాస్తు చేసు‌కో‌లేక పోయారు. ఇంకా సమయం కావా‌లని వివిధ ప్రాంతా‌ల‌నుంచి విజ్ఞప్తులు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీంతో, రాష్ట్రంలో ప్రస్తుత పరి‌స్థి‌తిని, వచ్చిన విజ్ఞప్తు‌లను పరి‌శీ‌లిం‌చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు.. గడు‌వును మరో 15 రోజు‌ల‌పాటు పొడి‌గిం‌చా‌లని నిర్ణయిం‌చారు. దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కాగా..బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 16,28,844 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని అధికారులు చెబుతున్నారు.. ఇందులో కార్పొరేషన్‌ల పరిధిలో 2,91,066, మున్సిపాలిటీల్లో 6,70,085, గ్రామ పంచాయతీల పరిధిలో 6,67,693 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

Related posts