నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీ శాసనసభ ఉపనేతలను టీడీపీ ఎల్పీ నేత చంద్రబాబు ఖరారు చేశారు. శాసనసభలో టీడీపీ ఎల్పీ ఉప నేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, విప్ గా బాలవీరాంజనేయస్వామిని నియమించారు.
శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా సంధ్యారాణి, జి.శ్రీనివాసులు, విప్ గా బుద్ధా వెంకన్నను నియమించారు. శాసనమండలిలో టీడీపీకే బలం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు సమన్వయంతో పని చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమస్యలకు పరిష్కారం: చంద్రబాబు