తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని వెల్లడించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా డబ్బులు జమచేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఖరీఫ్ సాగు మొదలైన నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని..ఇందుకోసం త్వరితగతిన వారి ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
రైతులు, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో నష్టపోకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ధాన్యం అమ్మిన డబ్బులు ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని..మిగతా వారి బ్యాంకు ఖాతాల్లో కూడా త్వరలోనే డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. దీనిపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!