భారత యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. అయ్యర్ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ యాజమాన్యం నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది. ఏప్రిల్ 10న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ తలపడనుంది. అయితే ఈరోజు ప్రాక్టీస్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘కెప్టెన్సీ బాధ్యతలతో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్‌ను ఎదుర్కొంటున్నా. నా జీవితంలో ధోనీ బాయ్‌కి ప్రత్యేకస్థానం ఉంది. ధోనీ ఆటను చూస్తూ పెరిగిన నాకు ఈరోజు అతని ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. మహీ ఆట నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకున్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ధోనీ లాంటి వ్యక్తితో ఆడేందుకు ఏ ఆటగాడైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నేను దానికోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. నాకు తెలిసి ఢిల్లీ గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.