telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ : … మీ-సేవ కార్యాలయాలకు … బ్రేక్..

temporary break to meseva centers in telangana

రాష్ట్రంలో మీ-సేవ కార్యాలయాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు పనిచేయవు. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా ఈడీఎం కార్తీక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా మీ-సేవ సేవలు బంద్ అవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 13వ తేది రాత్రి 7గంటల నుంచి మీ సేవా సేవలు బంద్ అవ్వనుండగా.. 16వ తేది ఉదయం 8గంటలకు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.

ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ముందస్తు సమాచారం పంపామని.. మీ-సేవ నిర్వాహకులు కూడా ముందుగానే ఈ అంతరాయం గురించి ప్రజలకు వివరించాలని ఈఎండీ కార్తీక్ సూచించారు. అలాగే ఈ విరామ సమయానికి ప్రజలు కూడా సహకరించాలని కార్తీక్ కోరారు.

Related posts