telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పెళ్ళిచూపులు”పై ప్రదీప్ దిమ్మతిరిగే సెటైర్

Pradeep

తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు. ఇక తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా ప్రదీపే. ప్రతీ షోలో కూడా ఈయన పెళ్లి గురించి కామెంట్స్ వినిపిస్తుంటాయి. స్టార్ మా ఛానెల్ అయితే ఏకంగా ప్రదీప్ కోసం స్వయంవరమే ఏర్పాటు చేసింది. ఈయన కోసం ప్రత్యేకంగా పెళ్లిచూపులు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. అది ఫ్లాప్ అయింది.. అది వేరే విషయం అనుకోండి. ఇక ఇప్పుడు మరోసారి ప్రదీప్ పెళ్లి టాపిక్ వచ్చింది. తాజాగా ఈయన కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్ 4తో బిజీగా ఉన్నాడు. ఇందులో అవికా గోర్‌తో పాటు ఓంకార్, అశ్విన్ వచ్చారు. రాజుగారిగది 3 ప్రమోషన్ కోసం వాళ్లు ఇక్కడికి వచ్చారు. అక్కడే చిన్న స్కిట్ కూడా చేసారు. అందులో భాగంగానే అవికా గోర్ పెళ్లి చూపుల్లో కూర్చుంటే చూసుకోడానికి పెళ్లి వాళ్లు వస్తారు. పెళ్లికొడుకుగా ప్రదీప్‌ను కూర్చోమని ఓంకార్ సైగ చేస్తాడు. వెంటనే తన పెళ్లిపై అదిరిపోయే సెటైర్ వేసుకున్నాడు ఈ కుర్ర యాంకర్. అమ్మో.. దానికి మనకు అస్సలు పడదుగా.. పెళ్లికి మనం చాలా దూరం అంటూ పంచ్ వేసాడు. దాంతో అక్కడున్న వాళ్లకు నవ్వు ఆగలేదు. మొత్తానికి ప్రతీసారి కూడా తన పెళ్లిపై వచ్చే కమెంట్స్‌ను విని విని చివరికి తనే జోకులు వేసుకోవడం మొదలుపెట్టాడు ప్రదీప్. మొత్తానికి ఈ యాంకర్ పెళ్లి కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.

Related posts