telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

మైనర్ బాలికతో ఉపాధ్యాయుడు రహస్య వివాహం!

marriage wishes gone viral and case filed

పాఠశాలలో విద్యా బుద్దులు నేర్పించే ఓ ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థితో రహస్య వివాహం చేసుకున్న విషయం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వై.రామవరం మండలం దాలిపాడు ప్రభుత్వ గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాథ్యాయుడు వివాహం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు దాలిపాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు, వార్డెన్‌గా పని చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని, కొన్ని నెలలుగా ఆ బాలికతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియటంతో ఉపాథ్యాయుడిని నిలదీశారు. విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పెద్దల సమక్షంలో మైనర్ బాలికను ఉపాథ్యాయుడు చిన్నబ్బాయి రహస్యంగా వివాహం చేసుకున్నాడు.

Related posts