telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జయలలిత బయోపిక్ కు బ్రేక్ వేస్తానంటున్న దీప

Deepa

దివంగ‌త న‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప‌లు బ‌యోపిక్స్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే . దర్శకుడు విజయ్‌.. తలైవీ పేరుతో బ‌యోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ అమ్మగా నటిస్తుంది. అదే విధంగా దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది. ఇక ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో క్వీన్ పేరుతో గౌత‌మ్ మీన‌న్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర ప్రీ లుక్ కూడా విడుద‌ల చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే జ‌య‌ల‌లిత బ‌యోపిక్ చిత్రాలు మ‌రికొద్ది రోజుల‌లో రిలీజ్ కానున్న నేప‌థ్యంలో చిత్ర రిలీజ్‌ని అడ్డ‌కుంటాన‌ని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప జ‌య‌కుమార్. చిత్ర రిలీజ్ ఆపేందుకు మ‌ద్రాస్ హైకోర్ట్‌ని కూడా దీప ఆశ్ర‌యించిన‌ట్టుగా తెలుస్తుంది.

Related posts