telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

 మద్యం విక్రయాలకు కేరళ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!

liquor shops ap

లాక్ డౌన్ నేపథ్యంలో మందుబాబులు మద్యం కోసం అల్లాడుతున్నారు. మందు దొరక్క మద్యం ప్రియులు ఉక్కిరిబిక్కిరవుతూ  ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, కేరళలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మందు బాబుల సమస్య పై కేరళ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు కేరళ ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే మద్యం కావాల్సిన వాళ్లు వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్‌ తీసుకు వచ్చిన మారికి మాత్రమే మద్యం విక్రయిస్తామని షరతు విధించింది.

వీలైతే ఆన్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు కేరళ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మద్యం దొరక్క సోమవారం ఒక్కనాడే కేరళలో తొమ్మిదిమంది మరణించారు.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారులను సంప్రదించిన సీఎం విజయన్‌ వైద్యుల నుంచి అనుమతి పత్రం పొందిన వారికి మాత్రం మద్యం విక్రయించాలని నిర్ణయించారు.

Related posts