telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మమతా మోహన్‌దాస్ కు స్వాగతం పలికిన ఎనిమి…

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమాల్లో ఎనిమి కూడా ఒకటి. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు నటిస్తున్నారు. విశార్ హీరో పాత్రలో చేస్తుండగా, ఆర్య విలన్‌గా కనబడనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మంచి స్పందన అందుకున్నాయి .ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షూటింగ్‌ను హైదరాబాద్‌లో చేశారు. ఇక ఈ సినిమాలో మిర్నాలిని రవి కథానాయికాగా చేస్తోంది. అలాగే రెండో హీరోయిన్ గా మమతా మోహన్‌దాస్ నటిస్తుంది. ఇక ఈరోజు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన మమతాకు స్వాగతం అంటూ చిత్రబృందం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అయితే ఈ మధ్యే చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఆర్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. చేతికి సంకెళ్ళు వేసుకొని దెబ్బలతో ఆర్య కనిపిస్తున్నాడు. ఎదో ఫైటింగ్ సీన్‌లా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఈ ఫోటో సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts