కరోనాపై పోరులో లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ రాష్ట్రంలో 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో వలస కూలీలు 9 లక్షలకు పైగా ఉంటారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. నిజాముద్దీన్ ఘటన తర్వాత అప్రమత్తం అయ్యాం. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించాం. కరోనా ఫ్రీ తెలంగాణే మా లక్ష్యం. నిజాముద్దీన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేస్తున్నాం. కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్లను కలిన వాళ్లంతా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
అమరావతి నేల నిర్మాణాలకు అనుకూలం కాదు: విజయసాయిరెడ్డి