telugu navyamedia
వార్తలు సామాజిక

తప్పుడు మెసేజ్ తో జాగ్రత్త.. వాట్సాప్ హెచ్చరిక

whatsapp

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ మొబైల్ నెంబర్ ను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కు ఓ సందేశం ద్వారా తప్పుడు పిన్ నెంబర్ పంపుతారని, పొరబాటున కూడా దాన్ని ఎంటర్ చేయొద్దని స్పష్టం చేసింది. వాట్సాప్ ఖాతా వెరిఫికేషన్ పేరిట మోసానికి తెరలేపుతారని, వారు పంపిన 6 అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయమని కోరతారని తెలిపింది. ఒక్కసారి ఆ నెంబర్ ను ఎంటర్ చేస్తే యూజర్ల ఖాతా వివరాలన్నీ హ్యాకర్ల చేతికి వెళతాయని వాట్సాప్ వెల్లడించింది.

ఇలాంటి తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పైగా ఈ సందేశాన్ని ఇతరులకు కూడా షేర్ చేయాలని సూచిస్తుంటారని పేర్కొంది. తాము యూజర్లను ఎప్పుడూ వెరిఫికేషన్ గురించి అడగబోమని, యూజర్లకు తాము పంపే సందేశాలు బ్లూ టిక్ ఉన్న ఖాతా నుంచే వస్తాయని వాట్సాప్ నిపుణుల బృందం వెల్లడించింది.

Related posts