telugu navyamedia
వార్తలు

59 సంవత్సరాల “నాదీ ఆడజన్మే”

నటరత్న ఎన్.టి.రామారావు గారు. నటించిన సాంఘిక చిత్రం శ్రీవాణీ ఫిలింస్ వారి “నాదీ ఆడజన్మే” 07-01-1965 విడుదలయ్యింది. మనిషికి బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్యం ప్రధానమైనది అనే అంశాన్ని ఇతివృతం గా తీసుకుని ప్రముఖ నటుడు ఎస్.వి.రంగారావు నిర్మాతగా శ్రీవాణీ ఫిలింస్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు ఏ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: శైలేష్ డే, స్క్రీన్ ప్లే:ఏ.సి.త్రిలోకచందర్, మాటలు: డి.వి.నరసరాజు, పాటలు: దాశరథి, సంగీతం: ఆర్.సుదర్శనం, ఫోటోగ్రఫీ: టి.ముత్తుస్వామి, కళ: ఏ.కె.శేఖర్, నృత్యం: ఏ.కె.చోప్రా, ఎడిటింగ్: ఆర్.జి.గోప్, అందించారు.

ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి , హరనాధ్, జమున, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పెరుమాళ్ళు, సురభి బాలసరస్వతి, జగ్గయ్య, ఛాయాదేవి, ఏ.ఎల్.నారాయణ, రామచంద్రరావు, మాస్టర్ బాబు తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు సుదర్శనం సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు హిట్ అయ్యాయి.
“నామాట నమ్మితి వేల,నామీద కోప మదేల'”
“కన్నయ్యా,నల్లని కన్నయ్యా,
నిన్ను కనలేని కనులుండునా”
“చిన్నారి పొన్నారి పువ్వూ,విరబూసి విరబూసి నవ్వూ'”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బెంగాలీ కథ ఆధారంగా తమిళంలో విజయవంతమైన “నానుమ్ ఒరు పెణ్” (1963) తమిళచిత్రం యొక్క రైట్స్ తీసుకుని శ్రీవాణి ఫిలింస్ పతాకంపై తెలుగులో ప్రముఖ నటులు ఎస్.వి.రంగారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం ఘన విజయం సాధించి, .విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు,
13 కేంద్రాల్లో 100 రోజులు (శతదినోత్సవాలు) ప్రదర్శింపబడింది.
100 రోజుల ప్రదర్శింపబడిన కేంద్రాలు :-
1. విజయవాడ — దుర్గ కళామందిరం,
2. గుంటూరు– నాజ్ డీలక్స్,
3. రాజమండ్రి — అశోక,
4. కాకినాడ — క్రౌన్,
5. విశాఖపట్నం — లక్ష్మీ టాకీస్ ,
6. నెల్లూరు — శేష మహల్,
7. విజయనగరం — శ్రీరామ,
8. అమలాపురం — కమలేశ్వర,
9. ఏలూరు — వెంకట్రామ ,
10. భీమవరం — సత్యనారాయణ,
11. మచిలీపట్నం — బృందావన్,
12. తెనాలి — వీనస్,
13. తిరుపతి — జ్యోతి టాకీస్
థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది….

Related posts