కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేడు విశాఖ రానున్నారు. తూర్పు నావికాదళం (ఈఎన్‌సీ) ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజ్‌నాథ్‌సింగ్ నగరానికి చేరుకోనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి ఏడు గంటలకు విశాఖ చేరుకుంటారు.
ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన స్వర్ణజయంతి ఆడిటోరియంలో జరిగే సమావేశంలో ఇద్దరు నేతలు పాల్గొంటారు. కేంద్ర మంత్రి రాత్రికి అక్కడే బస చేయనుండగా, సీఎం జగన్ రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్తారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాజ్‌నాథ్ తొలిసారి విశాఖకు వస్తున్నారు. ఆదివారం ఉదయం ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరి ఈఎన్‌సీ ప్రధాన కేంద్రానికి చేరుకుని రాజ్‌నాథ్ నౌకలను సందర్శిస్తారు. నావికులు, నేవీ అధికారులు, నేవీ సివిలియన్ అధికారులతో సమావేశమవుతారు.
రాజకీయ స్వలాభం కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ: డీకే అరుణ