telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం…

ఏపీ వ్యవసాయ శాఖ కర్ఫ్యూ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులకు కర్ఫ్యూ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పనులు నిర్వహించుకోవాలని సూచించింది. వ్యవసాయ కూలీల రవాణ.. వ్యవసాయ సంబంధిత పనుల నిమిత్తం జరిపే రాకపోకలకు పాసులు జారీ చేస్తామని… ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, వ్యవసాయ పని ముట్ల అమ్మే దుకాణాలు రిపేర్ షాపులకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు కల్పించింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేయనున్నట్టు.. కానీ ఈసారి ఓటీపీ విధానం ద్వారా సబ్సిడీ విత్తన పంపిణీ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లల్లో నో మాస్క్-నో ఎంట్రీ విధానాన్ని పాటించాలని… రైతు బజార్లను డీ సెంట్రలైజ్ చేయాలని సూచించింది. కాలేజీలు, స్కూళ్ల గ్రౌండ్లల్లో.. అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో మినీ రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Related posts