telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వరుస భూకంపాలతో .. వణికిపోయింది అరుణాచల్ ప్రదేశ్ ..

4 earthquakes in arunachal pradesh

వరుసగా నాలుగు భూకంపాలతో అరుణాచల్ ప్రదేశ్‌ వణికిపోయింది. నిన్న ఒక్క రోజే మూడు భూకంపాలు సంభవించగా.. ఈ ఉదయం కూడా మరోసారి భూమి కంపించిందని వాతావారణ శాఖ వెల్లడించింది. వాటి తీవ్రతలు రికార్డు స్కేలుపై 5.5, 5.6, 3.8, 4.9గా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అయితే వీటి వలన ఇప్పటివరకు పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మొదటి భూకంపం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్‌ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం 2.52గంటల సమయంలో 10కి.మీ లోతులో 5.6 తీవ్రతతో సంభవించింది.

రాష్ట్ర రాజధాని ఈటా నగర్‌తో పాటు సరిహద్దు రాష్ట్రం అస్సాం, నాగాలాండ్‌లోని పలు ప్రాంతాలు కంపించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండో భూకంపం 3.8తీవ్రతతో మధ్యాహ్నం 3.04గంటల సమయంలో అదే జిల్లాలోనే సంభవించిందని వారు పేర్కొన్నారు. ఆ తరువాత మూడో భూకంపం మధ్యాహ్నం 3.21గంటల సమయంలో కురుంగ్ కుమే జిల్లాలో 4.9తీవ్రతతో 95కి.మీల లోతులో సంభవించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈ ఉదయం 4.24గంటల సమయంలో 5.5 తీవ్రతతో నాలుగో భూకంపం మళ్లీ తూర్పు కమెంగ్ జిల్లాలోనే వచ్చిందని తెలిపారు. భూకంప పటంలో ఈశాన్య రాష్ట్రాలు ప్రమాదకరమైన 5వ జోన్‌లోకి రావడంతో తరచూ అక్కడ భూకంపాలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Related posts